News March 10, 2025
కృష్ణా జిల్లాలో రాత్రి గస్తీ కట్టుదిట్టం

కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపీఎస్ ఆదేశాలతో ఆదివారం రాత్రి గస్తీ పటిష్ఠంగా కొనసాగుతోంది. నేర నియంత్రణ, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు అనుమానిత వాహనాలు, ప్రయాణికుల తనిఖీ, సీసీ కెమెరాల పర్యవేక్షణ చేపట్టారు. హైవేలపై డ్రైవర్లకు అవగాహన కల్పించి, బస్టాండ్లు, లాడ్జిలలో కొత్త వారి వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News March 26, 2025
మూడో స్థానంలో కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 87,742 కోట్లు జీడీడీపీ నమోదు చేయగా, గత రెండేళ్లతో పోల్చితే 11.58% వృద్ధి సాధించింది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో నిలకడగా ఎదుగుతోంది. మాంసం, రొయ్యల ఉత్పత్తి, మైనింగ్, విద్యుత్, రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ మెరుగైన ప్రగతి కనబరిచింది. స్తుల దేశీయోత్పత్తిలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా మూడో స్థానంలో నిలిచింది.
News March 26, 2025
పామర్రు మహిళను హత్య చేసింది వీరే.!

తాడేపల్లి పరిధి కొలనుకొండ శివారులో పామర్రుకు చెందిన మహిళను హత్య చేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముత్యాల కోమల్ కుమార్, బత్తుల శశి అలియాస్ జెస్సీ ఇద్దరు పథకం ప్రకారం మహిళను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. 36 గంటల్లో కేసును చేధించిన తాడేపల్లి పోలీసులను SP అభినందించారు.
News March 26, 2025
MTM: ఎస్సీల సంక్షేమానికి రూ.341 కోట్ల బడ్జెట్ : శ్రీదేవి

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.341 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, వచ్చే ఏప్రిల్ మొదటి వారంలో వివిధ పథకాలు ప్రకటించనున్నట్లు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. మంగళవారం మచిలీపట్నం వచ్చిన ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు నివాళులర్పించి మాట్లాడారు.