News April 4, 2024

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి

image

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం ఘంటసాల మండలం లంకపల్లి వద్ధ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చల్లపల్లి మండలం మాజేరు శివారు పచ్చార్లంకకు చెందిన దాసరి నాగేశ్వరరావు- సరోజినీ దంపతులు ద్విచక్ర వాహనంపై తెల్లవారు జామున లంకపల్లి వస్తుండగా లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News April 17, 2026

ఇండస్ట్రియల్‌ నేరగాళ్లకు SP హెచ్చరికలు

image

బాపులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా (APIIC)నుSP విద్యాసాగర్ నాయుడు శుక్రవారం పరిశీలించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు, దొంగతనాలు, మహిళల ఉద్యోగుల భద్రత, బహిరంగ మద్యపానం వంటి సమస్యలపై చర్చించారు. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. వేధింపులు, దొంగతనాలు, అక్రమ మద్యం సేవపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు.

కృష్ణా జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

image

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 10,15,634 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 4,93,141 మంది ఉండగా, మహిళలు 5,22,463 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 30 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.