News February 23, 2025

కృష్ణా జిల్లాలో విషాదం.. ఇద్దరి మృతి

image

కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పోలవరం లాకులు కొమ్మూరు వద్ద నీటిలో పడి ఇద్దరు యువకులు మరణించారు. వీరవల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నాగూర్ బాషా (16), షేక్ షరీఫ్ (16) తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మరణించారు. పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. 

Similar News

News October 20, 2025

కృష్ణా: ఈ ఆలయం నరకాసురుడి సంహారానికి ప్రతీక..!

image

చల్లపల్లి మండలం నడకుదురులోని కృష్ణానది తీరాన ఉన్న పృథ్వీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఇక్కడే నరకాసురుడిని సంహరించారని ఇతిహాసం. అందుకే ఈ ప్రాంతం ‘నరకొత్తూరు’ నుంచి ‘నడకుదురు’గా మారింది. ఇక్కడి పాటలీ వృక్షం అరుదైనది. దీపావళికి నరకాసురుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. కార్తికంలో భక్తులు నది స్నానమాచరించి మొక్కులు తీర్చుకుంటారు.

News October 19, 2025

కృష్ణా: దీపావళి వ్యాపారాలపై వరుణుడి ప్రభావం

image

ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో జిల్లాలో దీపావళి వ్యాపారాలు పూర్తిగా మందగించాయి. పండుగ ముందు రోజే పూజా సామాగ్రి కొనుగోలు కోసం మార్కెట్‌కు రావాల్సిన ప్రజలు వర్షం కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. పూలు, పండ్లు, ప్రమిదలు, ఇతర పూజా సామాగ్రి కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు నిరాశకు గురయ్యారు. వర్షం ఆగకపోతే పండుగ రోజు కూడా వ్యాపార నష్టం తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News October 19, 2025

టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. అధిక శబ్దం కలిగిన బాణాసంచాను కాల్చే సమయంలో తోటి వారికి ఇబ్బంది కలగకుండా కుటుంబ సభ్యులు ముందుగా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా పండుగ జరుపుకోవాలని తెలిపారు. బాణాసంచా నిల్వలు కలిగి ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.