News June 22, 2024
కృష్ణా జిల్లాలో 2 నెలల పాటు ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’

జిల్లాలో డయేరియా నివారణకు జూలై 1 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’ నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’ నిర్వహణకు అవసరమైన కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. తాగునీటి కాలుష్యం జరగకుండా ఓవర్ హెడ్ ట్యాంక్‌లను పరిశీలించి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News January 2, 2026
కృష్ణా: రైతులకు రాజముద్రతో కొత్త పాస్‌పుస్తకాలు

కృష్ణా జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 176 గ్రామాల రైతులకు రాజముద్ర కలిగిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని 21 మండలాల్లోని లబ్ధిదారులకు ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభలలో వీటిని అందజేయనున్నారు. ఇప్పటికే E-KYC ప్రక్రియ ముగియగా, బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయిన వారికి నేరుగా పట్టాలు అందనున్నాయి.
News January 2, 2026
కృష్ణా: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ గ్రామసభలు

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ గ్రామసభలలో రీ-సర్వే పూర్తయిన అనంతరం రాజముద్రతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అధికారులు అందజేయనున్నారు. భూముల వివరాలపై సందేహాలు ఉంటే అక్కడికక్కడే నివృత్తి చేసే అవకాశం కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 82,210 పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
News January 1, 2026
కృష్ణా: కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం

నూతన సంవత్సర వేడుకలు జిల్లాలో అంబరాన్ని అంటాయి. గత సంవత్సరం స్మృతులను గుర్తు చేసుకుని కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరం 2026కు యువత స్వాగతం పలికారు. ఉదయమే ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకున్నారు. కొంతమంది మంచి సంకల్పంతో నూతన సంవత్సరం తొలి రోజును ప్రారంభించారు.


