News April 24, 2024

కృష్ణా జిల్లాలో 4వ రోజు 31నామినేషన్‌లు 

image

నామినేషన్ల స్వీకరణలో భాగంగా 4వ రోజైన సోమవారం జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 31 నామినేషన్లు దాఖలవ్వగా ఇందులో మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి 03, 7 అసెంబ్లీ స్థానాలకు 28 నామినేషన్లు పడ్డాయి. మచిలీపట్నం అసెంబ్లీకి 04, గన్నవరం 02, గుడివాడ 08, పెడన 06, అవనిగడ్డ 02, పామర్రు 03, పెనమలూరు 03 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 57 నామినేషన్లు దాఖలయ్యాయి. 

Similar News

News January 18, 2025

నందిగామ మండలంలో దారుణ హత్య

image

నందిగామ మండల పరిధిలోని పల్లగిరి గ్రామ సమీపంలో సుబాబుల తోటలో షేక్ నాగుల్ మీరా అనే వ్యక్తిని కర్రలతో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి స్నేహితులతో సుబాబులు తోటలో మద్యం సేవించే క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగినట్లుగా సమాచారం. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News January 18, 2025

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతన డీఎస్పీలు వీరే

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతనంగా పలువురు డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తూ శుక్రవారం రాత్రి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీచేశారు. విజయవాడ సౌత్ ఏసీపీగా దేవినేని పవన్ కుమార్, గుడివాడ డీఎస్పీగా ధీరజ్ వినీల్ అవనిగడ్డ డీఎస్పీగా తాళ్లూరు విద్యశ్రీ ను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని ఉత్తర్వులు పేర్కొన్నారు.

News January 18, 2025

కలిదిండి: మాజీ సర్పంచ్‌ది ప్రమాదం కాదు.. హత్య

image

కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం సంతోషపురం మాజీ సర్పంచ్ కాలవ నల్లయ్యది ప్రమాదం కాదని హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బోధన శీను పథకం ప్రకారం గురువారం సాయంత్రం దాడి చేసి హతమార్చినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. హత్య కేసుగా నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు.