News April 25, 2024
కృష్ణా జిల్లాలో 5వ రోజు 28 నామినేషన్లు దాఖలు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో భాగంగా 5వ రోజైన మంగళవారం జిల్లాలో మరో 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం MP స్థానానికి 07, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 21 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం అసెంబ్లీకి 07, గన్నవరంకు 07, అవనిగడ్డకు 03, పెడనకు 01, పామర్రుకు 01, పెనమలూరుకు 01, గుడివాడకు ఒక నామినేషన్ దాఖలైనట్టు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
Similar News
News April 21, 2025
VJA ఆటోనగర్ లాడ్జీల్లో తనిఖీలు

విజయవాడ ఆటోనగర్‌లోని లాడ్జీల్లో శనివారం అర్ధరాత్రి పటమట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని, వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటమట పోలీసులు తెలిపారు.
News April 21, 2025
కృష్ణా: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

కృష్ణా జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.
News April 21, 2025
కృష్ణా: ‘నేడు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం’

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు(సోమవారం) కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందన్నారు.