News November 28, 2024

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే వర్ధంతి

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ డీకే బాలాజీ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సముద్దరణకు ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు. 

Similar News

News December 4, 2024

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం : మంత్రి

image

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో రహదారి వెంబడి ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి రైతుతో మాట్లాడారు. తుఫాను నేపథ్యంలో కొంత ఇబ్బంది కలిగిందని, రైతులు భయపడవద్దని ఆయన తెలిపారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోతే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు.

News December 4, 2024

కృష్ణా: బీ-ఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీ-ఫార్మసీ కోర్సు(Y17 నుంచి Y23 బ్యాచ్‌లు) చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను 2025 జనవరి 28 నుండి నిర్వహిస్తామని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 13లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని కోరింది.

News December 4, 2024

బ్లేడ్‌తో భర్త గొంతు కోసి చంపిన భార్య.. అనుమానాలే కారణం

image

భర్త గొంతు కోసం భార్య <<14781158>>హతమార్చిన<<>> ఘటన నిన్న గుడివాడలో జరిగిన సంగతి తెలిసిందే. భార్యభర్తల మధ్య అనుమానపు విభేదాలే హత్యకు కారణంగా తెలిసింది. రైలుపేటకు చెందిన చిన్న, జ్యోతిలు ఐదు చోరీ కేసుల్లో నిందితులగా ఉన్నారు. విభేదాలు తలెత్తి ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. నిన్న జ్యోతి ఇంటికి రాగా ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో బ్లేడ్‌తో భర్త పీక కోసి చంపింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు.