News January 26, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్కు అవార్డు

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును కైవశం చేసుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. గత ఏడాది కృష్ణాజిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా 2024 సార్వత్రిక ఎన్నికలను సమర్ధవంతంగా పూర్తి చేశారు.
Similar News
News April 23, 2025
పెనమలూరు: ఉరి వేసుకుని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఉరివేసుకుని విద్యార్థిని మృతి చెందింది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న యార్లగడ్డ ఖ్యాతి (20) హాస్టల్ రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు.
News April 23, 2025
నేడే రిజల్ట్.. కృష్ణా జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కృష్ణా జిల్లాలో మొత్తం 25,259మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రెగ్యులర్ విద్యార్థులు 21,009, ప్రైవేట్, ఒకేషనల్ విద్యార్థులు 4,250 మంది ఉన్నారు. నేడు విడుదలయ్యే పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
News April 23, 2025
కృష్ణా: ధరిత్రిని కాపాడుకుందాం- కలెక్టర్

జిల్లా ప్రజలు ధరిత్రిని కాలుష్యం నుంచి కాపాడడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం ధరిత్రి దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని తన చాంబర్లో కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధరిత్రి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక పర్యావరణ అవగాహన కార్యక్రమం అని పేర్కొన్నారు.