News April 4, 2025
కృష్ణా జిల్లా డీసీహెచ్ఎస్గా బాధ్యతలు స్వీకరించిన శేషు కుమార్

కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి (DCHS)గా నియమితులైన శేషు కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా DCHSగా పనిచేస్తున్న శేషు కుమార్ ఇటీవల జిల్లాకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ డీకే బాలాజీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
Similar News
News April 5, 2025
కృష్ణా: బాబు జగ్జీవన్ రామ్కి కలెక్టర్ నివాళి

దేశానికి అపార సేవలందించిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం మచిలీపట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ, జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తోందన్నారు.
News April 5, 2025
మచిలీపట్నం: సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ రామ్: ఎస్పీ

మానవ తావాదం, ఆదర్శవాదం వంటి సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. జగ్జీవన్ రామ్ 117వ జయంతిని జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీస్లో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ ఇతర పోలీస్ అధికారులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
News April 5, 2025
మైలవరంలో ఒకరి ఆత్మహత్య

మైలవరంలో శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం మేరకు.. దేవుని చెరువులో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు భార్య, పిల్లల్ని వదిలేసి ఓ మహిళతో సహజీనవం చేస్తున్నాడు. ఆ మహిళ సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చే సరికి వెంకటేశ్వరరావు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో పోలీసులుకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.