News August 11, 2024
కృష్ణా జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరికలు
కొరియర్ పేరిట మోసగాళ్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై స్పందించవద్దని కృష్ణా జిల్లా ప్రజలకు పోలీసులు హెచ్చరించారు. మీ పేరుపై పార్సిల్ వచ్చిందని, పార్సిల్ పేరుతో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచించింది. ఈ విధమైన ఫోన్ కాల్స్ ప్రభావానికి గురి కావొద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే హెల్ప్ లైన్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News September 8, 2024
నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
వినాయక చవితి సందర్భంగా మంగినపూడి బీచ్, కాలేఖాన్ పేట మంచినీళ్ళ కాలువ వద్ద నిమజ్జనాల ఏర్పాట్లను ఎస్పీ ఆర్.గంగాధర రావు స్వయంగా పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతిమలను నిమజ్జనం చేసే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. భక్తులు నీటిలో ఎక్కువ దూరం వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
News September 7, 2024
విజయవాడ: APSSDC కీలక నిర్ణయం
వరద బాధితుల ఇళ్లలో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ల సేవలు అందించేందుకు APSSDC(ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్)యాప్ తీసుకొచ్చింది. APSSDC ద్వారా శిక్షణ పొందిన ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసేందుకు 462 మంది ముందుకొచ్చారని, త్వరలో వీరిని ముంపు ప్రాంతాలకు పంపించి బాధితుల ఇళ్లలో ప్లంబింగ్ తదితర పనులు చేయిస్తామని అధికారులు తెలిపారు.
News September 7, 2024
ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు వీరివే..?
ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్ల యజమానులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ పడవలు గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్‍కు చెందినవిగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రభుత్వ సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. యజమానుల గుర్తింపుపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.