News February 26, 2025
కృష్ణా జిల్లా ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు: ఎస్పీ

కృష్ణా జిల్లా ప్రజలందరికీ, పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ఆర్. గంగాధర రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లా పోలీస్ శాఖ తరఫున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులందరి సమక్షంలో సంతోషం జరుపుకోవాలని ఆయన కోరుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News February 26, 2025
కృష్ణాజిల్లా టాప్ న్యూస్

* శివనామస్మరణలతో మార్మోగిన శైవ క్షేత్రాలు* పెదకళ్లేపల్లి నాగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు* రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు* డ్రై డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారుల దాడులు.. మచిలీపట్నం స్టేషన్ పరిథిలో ముగ్గురు అరెస్ట్* ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో రేపు జిల్లాలో విద్యా సంస్థలకు శెలవు
News February 26, 2025
మచిలీపట్నం: రామలింగేశ్వరుడిని దర్శించుకున్న కలెక్టర్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి మచిలీపట్నం రాబర్ట్ సన్ పేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ అధికారులు కలెక్టర్ కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News February 26, 2025
MTM: ప్రారంభమైన పోలింగ్ మెటీరియల్ పంపిణీ

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్కు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రారంభమైంది. స్థానిక నోబుల్ కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయగా పోలింగ్ కేంద్రాల వారీగా మెటీరియల్ పంపిణీని అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.