News April 8, 2025
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ

కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారెక చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. విశాఖపట్నం జిల్లా వ్యాట్ కోర్ట్ అప్పిలేట్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జి. గోపిని జిల్లా జడ్జిగా నియమించారు. రాష్ట్రంలో పలువురు జడ్జ్ లను బదిలీ చేయగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు విశాఖపట్నంకు, SC, ST కోర్టు జడ్జి చిన్నబాబు అనంతపురం జిల్లా పోక్సో కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.
Similar News
News December 13, 2025
21న మచిలీపట్నం నుంచి అజ్మీర్‌కు స్పెషల్ ట్రైన్

అజ్మీర్ ఉరుసు ఉత్సవాలకు వెళ్లేందుకు గాను ఈ నెల 21వ తేదీన మచిలీపట్నం నుంచి అజ్మీర్‌కు ప్రత్యేక ట్రైన్‌ను వేసినట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరే ఈ స్పెషల్ ట్రైన్ 23వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు అజ్మీర్ చేరుకుంటుందన్నారు. 28వ తేదీ అజ్మీర్ నుంచి బయలుదేరి 30వ తేదీ ఉదయం 9.30గంటలకు తిరిగి మచిలీపట్నం చేరుకుంటుందని చెప్పారు.
News December 12, 2025
కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST-2026) శనివారం జిల్లా వ్యాప్తంగా జరగనుంది. మొత్తం 17 కేంద్రాల్లో 1,894 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) యు.వి. సుబ్బారావు తెలిపారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ వెల్లడించారు.
News December 12, 2025
దివ్యాంగుల సేవలు ప్రతి గ్రామానికి చేర్చాలి: DEO

దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా డీఈఓ యు.వి. సుబ్బారావు ఎంఈఓలకు సూచించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కృష్ణవేణి ఐటీఐ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన సహిత విద్యపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


