News December 17, 2024
కృష్ణా జిల్లా రాజకీయాలను వేడెక్కించిన విగ్రహావిష్కరణ
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో మంత్రి పార్థసారథి, పలాస MLA గౌతు శిరీషతో కలిసి వైసీపీ నేత జోగి రమేశ్ పాల్గొనడం టీడీపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. YCP హయాంలో తమను వేధించిన జోగితో కలిసి వేదిక ఎలా పంచుకుంటారని కార్యకర్తలు భగ్గుమన్నారు. దీనిపై ఇప్పటికే పార్థసారధి క్షమాపణలు తెలిపారు. TDP అధిష్ఠానం సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Similar News
News January 17, 2025
మచిలీపట్నం: మెయిన్స్‌కు 262 మంది క్వాలిఫై
మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు పురుష అభ్యర్థులు 390 మంది హాజరయ్యారని జిల్లా SP కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వీరిలో 128 మంది డిస్ క్వాలిఫై అయ్యారని పేర్కొంది. 262 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని జిల్లా SP కార్యాలయం వివరాలు వెల్లడించింది.
News January 16, 2025
మానవత్వం చాటుకున్న మంత్రి కొలుసు పార్థసారధి
మంత్రి కొలుసు పార్థసారధి మానవత్వం చాటుకున్నారు. గురువారం ఏలూరు నుంచి విజయవాడకు వెళుతుండగా జాతీయ రహదారిపై కలపరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడుకు చెందిన శిరీష, ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి ప్రమాదాన్ని చూసి తన కాన్వాయిని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు.
News January 16, 2025
కృష్ణా: పరీక్షా ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన బీపీఈడీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.