News April 29, 2024
కృష్ణా జిల్లా సంగ్రామంలో 94 మంది అభ్యర్థులు

కృష్ణా జిల్లాలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం 94 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మచిలీపట్నం పార్లమెంట్‌కు 15 మంది పోటీలో నిలవగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 79 మంది పోటీలో నిలిచారు. గన్నవరం అసెంబ్లీకి 12, గుడివాడకు 12, పెడనకు 10, మచిలీపట్నంకు 10, అవనిగడ్డకు 12, పామర్రుకు 08, పెనమలూరుకు 11 మంది పోటీలో నిలిచారు.
Similar News
News November 15, 2025
మచిలీపట్నం GGHలో అవినీతి మరకలు..?

మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రి అవినీతికి అడ్డాగా మారుతోందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారని రోగుల బంధువులు చెబుతున్నారు. ఇదేకాక శిక్షణ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థుల నుంచి సర్టిఫికేట్లు ఇచ్చే విషయంలో కూడా కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నాయి.
News November 15, 2025
కృష్ణా: కలెక్టరేట్లో చెత్తాచెదారం తొలగించిన కలెక్టర్

స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టరేట్ ఉద్యోగులు శ్రమదానం చేశారు. కలెక్టర్ డీకే బాలాజీతోపాటు వివిధ శాఖ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది శ్రమదానంలో పాల్గొన్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
కృష్ణా: 30 మంది జెడ్పీ ఉద్యోగులకు పోస్టింగ్

గత 6 నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న జెడ్పీ ఉద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు వారికి పోస్టింగ్‌లు ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2024 జూన్‌లో జెడ్పీ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. కౌన్సిలింగ్ ద్వారా 30 మంది ఉద్యోగులు జెడ్పీకి వచ్చారు. అయితే వీరికి సీట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు వీరందరికీ ఉన్నతాధికారులు సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


