News July 24, 2024
కృష్ణా జిల్లా TODAY TOP NEWS

* ప్రకాశం బ్యారేజీ గేట్లు క్లోజ్
* కృష్ణా: బడ్జెట్ నిర్ణయాలతో ఆ 20వేల మందికి లబ్ధి
* విజయవాడ: తల్లి పెళ్లి వద్దన్నందుకు కుమారుడు ఆత్మహత
* నూజివీడు IIITలో మద్యం బాటిళ్ల కలకలం
* పెనమలూరు: అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి
* ఎన్టీఆర్: నెల రోజుల వ్యవధిలోనే తండ్రీ కొడుకులు మృతి
* విజయవాడలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
* జగన్ కొత్త డ్రామాలాడుతున్నాడు: బుద్ధా వెంకన్న
Similar News
News February 23, 2026
కృష్ణా: 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్‌కు ప్రణాళికలు

విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి గంగూరు వరకు 14KM ఎలివేటెడ్ మెగా ఫ్లైఓవర్ కారిడార్ నిర్మాణానికి NH అధికారులు సానుకూలంగా స్పందించారు. బందరు రోడ్డునుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్ ఆటంకం లేకుండా అమరావతి వైపు ప్రయాణించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్డు విస్తరణ లేకుండానే 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. గంగూరు- దావులూరు ORR వరకు హైవేను 6 లైన్లుగా విస్తరిస్తారు.
News February 23, 2026
కృష్ణా: అపరాల కోతలకు కూలీల కొరత

జిల్లాలో రెండో పంటగా సాగుచేసిన అపరాల పంట కోతల దశకు చేరుకోవడంతో రైతులకు కూలీల కొరత తీవ్రంగా ఎదురవుతోంది. స్థానికంగా వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో జిల్లాకు తరలివస్తున్నారు. ప్రస్తుతం అపరాల పంట కోతలు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కూలీలకు డిమాండ్ ఏర్పడింది.
News February 23, 2026
కృష్ణా: ఇంటర్మీడియట్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సారి ఫస్ట్ ఇయర్‌కు 24,173 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రత, పర్యవేక్షణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు విధుల్లో ఉండనున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది.


