News February 25, 2025
కృష్ణా జిల్లా: TODAY TOP NEWS

* జిల్లావ్యాప్తంగా మూతపడ్డ మద్యం దుకాణాలు * MLC ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ * వల్లభనేని వంశీకి ముగిసిన విచారణ.. జైలుకు తరలింపు * గన్నవరంలో ఆటో బోల్తా.. వ్యక్తి మృతి * VJA: మసాజ్ సెంటర్‌పై కేసు.. చర్యలకు రంగం సిద్ధం * కృష్ణా: MLC ఎన్నికలు.. పరీక్షల వాయిదా * ఉంగుటూరు: వివాహితను వేధించిన వ్యక్తికి రిమాండ్ * 27న GOVT ఉద్యోగులకు Special క్యాజువల్ లీవ్: కలెక్టర్
Similar News
News February 26, 2025
కృష్ణా: MLC ఓటు వేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి.!

జనరల్ ఎలక్షన్ కంటే ఇవి కొంచెం భిన్నంగా ఉంటాయి. ఓటు వేయడానికి వెళ్లే టప్పుడు ఓటు స్లిప్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలి. పోలింగ్ కేంద్రంలో ఓటరుకు బ్యాలెట్ పేపర్‌ను ఇస్తారు. అందులో అభ్యర్థుల పేర్లతో పాటు ఫొటోలు ఉంటాయి. పోలింగ్ సిబ్బంది ఇచ్చిన పెన్నుతో మీరు ఎంచుకున్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇచ్చేలా 1 అని నంబర్ మాత్రమే వేయాలి. అక్షరాల్లో రాస్తే ఓటు చెల్లదు.
News February 26, 2025
కృష్ణా: 27న విద్యా సంస్థలకు సెలవు

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 27న జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు మంగళవారం తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ విషయాన్ని గ్రహించి 27న తమ పాఠశాలలకు సెలవు ప్రకటించాలన్నారు.
News February 26, 2025
కృష్ణా: శివరాత్రి ఉత్సవాలు.. ట్రాఫిక్ మళ్లింపు

ఐలూరులో శివరాత్రి ఉత్సవాలు సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నామని సీఐ చిట్టిబాబు తెలిపారు. విజయవాడ – అవనిగడ్డ వైపు వెళ్ళే వాహనాలు తోట్లవల్లూరు, ఉయ్యూరు మంటాడ, కృష్ణాపురం మీదిగా అవనిగడ్డ వెళ్లాలన్నారు. అవనిగడ్డ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలు లంకపల్లి-కృష్ణాపురం, ఉయ్యూరు, తోట్లవల్లూరు మీదుగా విజయవాడ మళ్లిస్తున్నామన్నారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.