News May 25, 2024

కృష్ణా: టిప్పర్‌ను ఢీకొన్న ఆటో.. మహిళ మృతి

image

ఏలూరు జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్‌‌ను ఆటో ఢీకొట్టగా.. ఆ ఆటోలో ఉన్న బొర్రా కుమారి(50) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఇతర వాహనదారులు క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు కుమారి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన మహిళగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 15, 2026

కృష్ణా: గ్యాస్ బుకింగ్‌పై మార్గదర్శకాలు జారీ

image

కృష్ణా జిల్లాలో LPG సరఫరా క్రమబద్ధీకరణకు JC నవీన్ ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఒక సిలిండర్ బుక్ చేశాక, రెండో బుకింగ్‌కు పట్టణాల్లో 30 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఈ నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 15, 2026

మచిలీపట్నంలో రేపు మీకోసం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.

News March 15, 2026

కృష్ణా: కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల కొరత.. భారంగా హోటల్స్ నిర్వహణ

image

కృష్ణా జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల కొరత ఏర్పడింది. గత వారం రోజులుగా హోటల్స్ & రెస్టారెంట్లకు కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల సరఫరా నిలిచిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో హోటల్స్ నిర్వహణ భారంగా మారిందని వ్యాపారులు అంటున్నారు. ఇదిలా ఉండగా సిలెండర్ల కొరతను అదునుగా చూసుకొని కొంత మంది అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌కు తెర లేపారన్న విమర్శలు విపినిస్తున్నాయి.