News December 31, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ వన్ టైం ఆపర్చ్యూనిటీ(ఇయర్ ఎండ్) థియరీ పరీక్షల టైం టేబుల్ మంగళవారం విడుదలయింది. ఈ పరీక్షలు 2025 జనవరి 6 నుంచి 25 మధ్య నిర్ణీత తేదీలలో నిర్వహిస్తామని యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు డిగ్రీ 1, 2, 3వ ఏడాది పరీక్షలు రాసే విద్యార్థులు సబ్జెక్టులవారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

Similar News

News January 17, 2025

జగ్గయ్యపేటలో దారుణ హత్య

image

జగ్గయ్యపేటలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన యర్రంశెట్టి ఆంజనేయులు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆంజనేయులు గతంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా పని చేశారు. గతంలో ఆయనపై పలు ఫిర్యాదులు రావడంతో సామినేని ఉదయభాను తొలగించారు. ఎన్నికలకు ముందు టీడీపీలో తిరుగుతూ ఉన్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

News January 17, 2025

మచిలీపట్నం: మెయిన్స్‌కు 262 మంది క్వాలిఫై

image

మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు పురుష అభ్యర్థులు 390 మంది హాజరయ్యారని జిల్లా SP కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వీరిలో 128 మంది డిస్ క్వాలిఫై అయ్యారని పేర్కొంది. 262 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని జిల్లా SP కార్యాలయం వివరాలు వెల్లడించింది.

News January 16, 2025

మానవత్వం చాటుకున్న మంత్రి కొలుసు పార్థసారధి

image

మంత్రి కొలుసు పార్థసారధి మానవత్వం చాటుకున్నారు. గురువారం ఏలూరు నుంచి విజయవాడకు వెళుతుండగా జాతీయ రహదారిపై కలపరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడుకు చెందిన శిరీష, ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి ప్రమాదాన్ని చూసి తన కాన్వాయిని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు.