News August 8, 2024
కృష్ణా: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో మే-2024లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News September 8, 2024
దాతలకు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్
వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ఏపీ దుస్థితికి చలించి పోయిన వారంతా విరాళాలు ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, NRIలు పలువురు, ఏపీ ఉద్యోగుల సంఘం తమ విరాళాలను ప్రకటించింది. ఇంకా పలువురు ప్రముఖులు విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు. విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
News September 8, 2024
వైసీపీ ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ చేయలేదు: సీఎం
అత్యంత క్లిష్టమైన బుడమేరు గండ్లను పూడ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 4 రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ కలిసి ఈ పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. దీంతో ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ సరిగా చేయలేదని ఆరోపించారు.
News September 8, 2024
నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
వినాయక చవితి సందర్భంగా మంగినపూడి బీచ్, కాలేఖాన్ పేట మంచినీళ్ళ కాలువ వద్ద నిమజ్జనాల ఏర్పాట్లను ఎస్పీ ఆర్.గంగాధర రావు స్వయంగా పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతిమలను నిమజ్జనం చేసే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. భక్తులు నీటిలో ఎక్కువ దూరం వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.