News July 14, 2024

కృష్ణా: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో BA, BCom, BSc, BBA, BCA, B.A.O.L విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి 14 వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

Similar News

News October 30, 2025

అవనిగడ్డ నియోజకవర్గంలో నేడు పవన్ కళ్యాణ్ పర్యటన

image

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం కోడూరు మండలంలో పర్యటించనున్నట్లు ఏపీ సెక్రటరీ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, 8:30 గంటలకు నాగాయలంకలో, 10:30 గంటలకు కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన ప్రకటనలో వివరించారు.

News October 29, 2025

కృష్ణా: 46,357 హెక్టార్లలో పంట నష్టం

image

తుపాన్ ధాటికి జిల్లాలో 46,357 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. 427 గ్రామాల పరిథిలో ఈ పంట నష్టం జరగ్గా 56,040 మంది రైతులు నష్టపోయారన్నారు. 45,040 హెక్టార్లలో వరి పంట, వేరుశెనగ 288 హెక్టార్లలో, 985 హెక్టార్లలో మిముము, 43 హెక్టార్లలో పత్తి పంట నష్టపోయిందన్నారు.

News October 29, 2025

సీఎం షెడ్యూల్ మార్పు.. అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ పర్యటన.?

image

సీఎం చంద్రబాబు షెడ్యూల్‌లో మార్పు జరిగింది. ఆయన నేడు కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించనున్నారు. కాగా, అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఆయన రోడ్డు మార్గంలో కోడూరు, నాగాయలంక మండలాలను సందర్శించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, బాధితులను పరామర్శిస్తారని సమాచారం.