News May 26, 2024
కృష్ణా: డిప్లొమా కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

దూరవిద్యా విధానంలో డిప్లొమా ఇన్ అపారెల్ మర్చండైజింగ్ కోర్సులో అడ్మిషన్లకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులో చేరాలనుకున్న విద్యార్థులు జూన్ 30లోపు అడ్మిషన్ పొందవచ్చని ఇగ్నో వర్శిటీ సూచించింది. అడ్మిషన్లకై https://ignouadmission.samarth.edu.in/ అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ఇగ్నో వర్గాలు సూచించాయి.
Similar News
News November 5, 2025
పెడన: సైబర్ క్రైమ్ కేసు.. విశాఖపట్నంకు ఆరుగురి తరలింపు

విశాఖపట్నం సైబర్ క్రైమ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన ఆరుగురిని అధికారులు పెడనలో అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం విశాఖపట్నానికి తరలించారు. నిందితులపై పెడన పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ అరెస్టులు, దర్యాప్తుతో పెడన ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
News November 4, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అసంబద్ధం: YS జగన్

కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒక్క రోజులోనే సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. 31 తర్వాత దరఖాస్తుకు కూడా అవకాశం లేదు. ఒక్కరోజులో పంట పొలాల్లోకి వచ్చి ఎన్యూమరేషన్ చేయటం అసాధ్యం అని జగన్ విమర్శించారు. అసలు ఎన్యూమరేషన్ అంటే చంద్రబాబుకు తెలుసో లేదో తెలుసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
News November 4, 2025
జగన్ కాన్వాయ్ను అనుసరిస్తుండగా బైక్ ప్రమాదం

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా ప్రమాదం జరిగింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్న జగన్ కాన్వాయ్ను బైక్పై అనుసరిస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. పామర్రు మండలం కనుమూరు గ్రామ పరిధిలోని రొయ్యల ఫ్యాక్టరీ వద్ద అదుపుతప్పి పడిపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.


