News August 3, 2024
కృష్ణా: డిప్లొమా పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున వర్శిటీ పరిధిలోని కళాశాలల్లో యోగాలో పీజీ డిప్లొమా కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఆగస్టు 19 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధరుసుము లేకుండా ఆగస్టు 9లోపు చెల్లించాలని పరీక్షల విభాగం తెలిపింది. పరీక్ష ఫీజు వివరాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News September 19, 2024
నేడు విజయవాడలో పవన్‌ను కలవనున్న బాలినేని
వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా గురువారం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీకానున్నారు. ఈ మేరకు గురువారం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్‌తో చర్చలు అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.
News September 18, 2024
కృష్ణా: ఇసుక బుకింగ్‌పై సిబ్బందికి శిక్షణ
ఇసుక Online బుకింగ్ విధానంపై గ్రామ / వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు చేయనున్నదని, ఇందుకు సంబంధించి పోర్టల్‌ను రేపు ప్రారంభిస్తారన్నారు.
News September 18, 2024
విజయవాడ: మంత్రి నిమ్మలను కలిసిన పలువురు నేతలు
విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడును మాజీ ఎంపీ, లైలా గ్రూప్ ఛైర్మన్, గోకరాజు గంగరాజు, ఎస్ఎల్వీ గ్రూప్ ఛైర్మన్ శ్రీనివాసరాజు, తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడును వారు సత్కరించారు. అనంతరం బుడమేరు వరద కారణంగా కేసరపల్లిలో ముంపుకు గురైన ఎస్ఎల్వీ లైలా గ్రీస్ మెడోస్ కాలనీవాసులకు భవిష్యత్తులో తమ నివాసాలవైపు వరద నీరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.