News December 19, 2024
కృష్ణా: డిప్లొమా విద్యార్థులకు ముఖ్య గమనిక

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో వాటర్&వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ కోర్సులో పీజీ డిప్లొమా(Y19) చదివిన విద్యార్థుల కోసం ‘వన్ టైం ఆపర్చునిటీ’ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2025 జనవరి 2 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, లేట్ ఫీ లేకుండా ఈనెల 26లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది. ఫీజు వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చని తెలిపింది.
Similar News
News March 15, 2026
కృష్ణా: గ్యాస్ బుకింగ్‌పై మార్గదర్శకాలు జారీ

కృష్ణా జిల్లాలో LPG సరఫరా క్రమబద్ధీకరణకు JC నవీన్ ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఒక సిలిండర్ బుక్ చేశాక, రెండో బుకింగ్‌కు పట్టణాల్లో 30 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఈ నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News March 15, 2026
మచిలీపట్నంలో రేపు మీకోసం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.
News March 15, 2026
కృష్ణా: కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల కొరత.. భారంగా హోటల్స్ నిర్వహణ

కృష్ణా జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల కొరత ఏర్పడింది. గత వారం రోజులుగా హోటల్స్ & రెస్టారెంట్లకు కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల సరఫరా నిలిచిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో హోటల్స్ నిర్వహణ భారంగా మారిందని వ్యాపారులు అంటున్నారు. ఇదిలా ఉండగా సిలెండర్ల కొరతను అదునుగా చూసుకొని కొంత మంది అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌కు తెర లేపారన్న విమర్శలు విపినిస్తున్నాయి.


