News May 24, 2024

కృష్ణా: తమిళనాడుకు ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా నాగర్‌కోయిల్ (NCJ), డిబ్రుగర్ (DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 06105 NCJ- DBRG రైలును జూన్ 14,21,28 తేదీలలో, నం.06106 DBRG- NCJ రైలును జూన్ 19, 26, జులై 3వ తేదీలలో నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.

Similar News

News December 10, 2025

గన్నవరం: ఇసుక కుప్ప కాదండి.. రంగు మారిన ధాన్యం..!

image

పై ఫోటోలో మీకు కనిపిస్తున్నది ఇసుక కుప్ప అనుకుంటున్నారు కదూ. కానే కాదు.. అది రంగు మారిన ధాన్యం రాశి. గత మొంథా తుఫాను వరదలో నానిన వరి చేను నూర్చారు. గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఇలా రంగు మారిన ధాన్యం రాశులు చూడొచ్చు. రైతులు 75 కిలోల బస్తా రూ.1300 చొప్పున వ్యాపారికి బుధవారం విక్రయించారు. ఈ విధంగా బస్తాకు వెయ్యి రూపాయలు చొప్పున రైతులకు నష్టాలు మిగిల్చింది తుఫాను.

News December 10, 2025

రహదారుల అభివృద్ధికి రూ.87.25 కోట్లు: ఎంపీ బాలశౌరి

image

కృష్ణా జిల్లా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 87.25 కోట్ల ఎస్‌ఏఎస్‌సీఐ (SASCI) నిధులు మంజూరు చేసినందుకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ఫేజ్-1 కింద రూ. 2,123 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ జీ.ఓ విడుదల చేసిందని ఎంపీ వివరించారు.

News December 9, 2025

కృష్ణా: డీఈఓ బదిలీ.. నూతన డీఈఓగా సుబ్బారావు

image

కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు బదిలీ అయ్యీరు. పల్నాడు జిల్లాకు రామారావును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో యూవీ సుబ్బారావును నియమించారు. సుబ్బారావు ఎన్టీఆర్ జిల్లా డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన మచిలీపట్నం డీవైఈఓగా విధులు నిర్వర్తించారు. సౌమ్యుడుగా, వివాదరహితునిగా సుబ్బారావు పేరు తెచ్చుకున్నారు.