News March 8, 2025
కృష్ణా: తాగునీటి సమస్యలు చెప్పేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్

వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు గాను జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ (RWS) కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు RWS SE శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే 08672-223522 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు ఈ నంబర్కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చని అన్నారు.
Similar News
News December 8, 2025
మచిలీపట్నం: అనాథ పిల్లలకు అమృత ఆరోగ్య కార్డులు

మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాథ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాథ పిల్లలకు ఆరోగ్య కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వారి ఆరోగ్య భద్రతపై అవగాహన కూడా కల్పించారు.
News December 8, 2025
కృష్ణా జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఏపీ టెట్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.
News December 8, 2025
మచిలీపట్నం: అనాధ పిల్లలకు ఆరోగ్య కార్డుల పంపిణీ

అనాధ పిల్లలకు ఆరోగ్య పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లో ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాధ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాధ పిల్లలకు కలెక్టర్ చేతుల మీదుగా ఆరోగ్య కార్డులు అందజేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల మాదిరి ఈ కార్డులు కూడా పని చేస్తాయన్నారు. కార్యక్రమంలో DMHO యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.


