News March 8, 2025

కృష్ణా: తాగునీటి సమస్యలు చెప్పేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్ 

image

వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు గాను జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ (RWS) కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు RWS SE శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే 08672-223522 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చని అన్నారు.

Similar News

News March 17, 2025

కృష్ణా: నేడు ‘మీకోసం’ కార్యక్రమం 

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు. 

News March 17, 2025

కృష్ణా: 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

image

10వ తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల చుట్టు పక్కల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నెట్, జిరాక్స్ సెంటర్లు, ఇతర ఏ విధమైన షాపులు తెరవడానికి వీలు లేదన్నారు. 

News March 17, 2025

కృష్ణా జిల్లాలో పది పరీక్షలకు సర్వం సిద్ధం 

image

నేటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 145 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 22,341 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పరీక్షా కేంద్రాల్లో చేపట్టారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా 52 సిట్టింగ్, 05 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. 

error: Content is protected !!