News April 15, 2025

కృష్ణా: ధాన్యం సేకరణకు 128 మిల్లులకు అనుమతులు

image

ఖరీఫ్ మిగులు ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 228 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతు సేవ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. 128 రైస్ మిల్లులకు ధాన్యం సేకరణకు అనుమతి ఇచ్చామన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచామన్నారు.

Similar News

News October 27, 2025

దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయండి: కలెక్టర్

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న దృష్ట్యా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.

News October 26, 2025

కృష్ణా: తుఫాన్‌ ప్రభావంపై డీపీఓ హెచ్చరిక

image

తుఫాన్‌ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీఓ) జె.అరుణ సూచించారు. మట్టి మిద్దెలు, కల్వర్టులు, పూరి గుడిసెలు, రోడ్డు పక్కన గుడారాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వీఆర్‌ఓలు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

News October 26, 2025

కృష్ణా: జిల్లాలో మండల ప్రత్యేక అధికారుల నియామకం

image

మొంథా తుపాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు గాను జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సజావుగా తుపాన్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.