News September 6, 2024

కృష్ణా నది వరద.. 120 ఏళ్లలో ఇలా..!

image

ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్‌ఫ్లో నమోదయిన విషయం తెలిసిందే. అయితే 120 ఏళ్లలో కృష్ణమ్మ వరద ఉద్ధృతి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1903 అక్టోబర్ 7న 10.68లక్షల క్యూసెక్కులు, 1914 ఆగస్టు11న 9.49, 1917 నవంబర్ 2న 9.55, 1949 సెప్టెంబర్ 24న 9.25, 1964 అక్టోబర్ 2న 9.88, 1998 అక్టోబర్ 17న 9.32, 2009 అక్టోబర్ 5, 6న 10.94, 2024 సెప్టెంబరులో 11.38లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద వచ్చింది.

Similar News

News October 10, 2024

కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాలకు 1734 దరఖాస్తులు

image

మద్యం దుకాణాలకు సంబంధించి కృష్ణా జిల్లాలో 1734 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. మొత్తం 123 దుకాణాలకు గాను బుధవారం రాత్రి 7గంటల సమయానికి ఆన్ లైన్ & ఆఫ్ లైన్‌లో 1734 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. దరఖాస్తు ఫీజు రూపేణా రూ.34.68కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చిందన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నామని అన్నారు.

News October 10, 2024

14న మచిలీపట్నంలో మద్యం టెండర్లు

image

కృష్ణాజిల్లాకు సంబంధించి ఈ నెల 14న మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో మద్యం టెండర్లు నిర్వహించనున్నట్టు ఉమ్మడి కృష్ణాజిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత టెండర్లు తెరిచే కార్యక్రమాన్ని నోబుల్ కాలేజీలో నిర్వహించాలని నిర్ణయించగా అనివార్య కారణాల వల్ల హిందూ కాలేజీ పీజీ సెంటర్, MBA బ్లాక్ కు మార్చడమైందన్నారు. ఈ మార్పును టెండరుదారులు గమనించాలన్నారు.

News October 9, 2024

విజయవాడ: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య సూసైడ్ UPDATE

image

అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన నాగరాజు మంగళవారం BRTSరోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అతని భార్య ఉష ఉరేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. గుణదల కుమ్మరి బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై భానునగర్ నుంచి పడవలరేవు వైపు రాంగ్ రూట్‌లో వెళుతూ నాగరాజు బైక్‌ను ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఉష పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.