News November 15, 2024

కృష్ణా నదీ వద్ద ప్రారంభమైన కార్తీక పౌర్ణమి స్నానాలు 

image

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం, కృష్ణా నదీ వద్ద పవిత్ర స్నానాలు ప్రారంభమయ్యాయి. పవిత్ర సముద్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో విచ్చేశారు. వేకువజాము నుంచే నదిలో భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు పవిత్ర స్నానం ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం భక్తులు పాత శివాలయానికి వెళ్లారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. 

Similar News

News December 10, 2024

గుడివాడ: కళాశాలకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలిక

image

గుడివాడ కేటీఆర్ మహిళా కళాశాల వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్మెన్‌గా ఉన్న దుర్గారావు కుమార్తె ప్రియాంక అదృశ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. పాలిటెక్నిక్ ఫస్టియర్ చదువుతున్న యువతి, శనివారం కాలేజీకి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వివాహితుడు రాహుల్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ పై టూ టౌన్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిపారు.

News December 10, 2024

తిరువూరు నుంచి Dy.CM పవన్‌కు బెదిరింపు కాల్స్

image

Dy.CM పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తిరువూరుకు చెందిన మల్లికార్జున రావుగా పోలీసులు గుర్తించారు. ఇతను పవన్ ఓఎస్డీకి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు అందగా..పోలీసులు రంగంలోకి దిగారు. ఎంజీ రోడ్డు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ ఏరియాలో ఆరా తీయగా అతని జాడలేదు.అతనే ఫోన్ చేశాడా.. ఎవరైనా అతని పేరుపై సిమ్ తీసుకున్నారా అని తెలియాల్సి ఉంది.

News December 10, 2024

జగన్‌ వెంటే ఉంటా: MLC

image

తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘నిబంధనలు మేరకు నాకు రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సభ్యునిగా అవకాశం ఇచ్చింది. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటా. నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి జగన్’ అని ఆయన చెప్పారు.