News February 23, 2025
కృష్ణా: నానిలు సేఫేనా.?

వల్లభనేని వంశీ అరెస్ట్ తరువాత పేర్ని నాని, కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న గుసగుసలు విస్తృతంగా వినిపించాయి. కూటమి నాయకులు కూడా పలు సందర్భాల్లో నెక్స్ట్ అరెస్ట్ వారే అని చెప్పారు. ఇది ఇలా ఉండగా మీ అరెస్టులు వల్ల రోమాలు కూడా ఊడవని పేర్ని నాని అన్నారు. మూడు కాకపోతే 30 కేసులు ఉంటాయని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. కాగా వీరన్న మాటలు ఇప్పుడు చర్చినీయాంశంగా మారాయి.
Similar News
News March 23, 2025
విజయవాడలో దుమారం రేపుతున్న బ్యానర్

విజయవాడ మొగల్రాజపురంలోని జమ్మి చెట్టు సెంటర్ వద్ద జగన్ ఫోటోతో వినూత్నంగా ఓ బ్యానర్ వెలిసింది. వైఎస్ జగన్ ఫోటోను వేసి కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బ్యానర్ తొలగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ బ్యానర్ విజయవాడలో దూమారం రేపుతోంది.
News March 23, 2025
VJA: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. దీంతో రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
News March 23, 2025
ఈనెల 30న కృష్ణా జిల్లాకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఈనెల 30వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో జరిగే ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 30వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ ఉగాది సంబరాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరుకానున్నారు.