News April 18, 2024
కృష్ణా: నామినేషన్లు దాఖలు చేసే వారికి పలు సూచనలు

MPగా పోటీ చేసే అభ్యర్థులు ఫారం-2ఎ, MLAగా పోటీ చేసే వాళ్లు ఫారం-2బీ ద్వారా నామినేషన్లు దాఖలు చేయాలి. అభ్యర్థులందరూ నవీకరించిన ఫారం-26 అఫిడవిట్ను ఖాళీలు లేకుండా పూర్తి చేసి నామినేషన్ పత్రంతో జతచేయాలి . పోటీ చేసే అభ్యర్థి లేక ప్రతిపాదకుడు నామినేషన్ దాఖలు చేయవచ్చని కలెక్టర్ బాలాజీ తెలిపారు. MPఅభ్యర్థి రూ.25వేలు, MLAఅభ్యర్థి రూ.10వేలు, SC, STలు రూ.12,500, రూ.5వేల డిపాజిట్ చేయాలని చెప్పారు.
Similar News
News December 12, 2025
దివ్యాంగుల సేవలు ప్రతి గ్రామానికి చేర్చాలి: DEO

దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా డీఈఓ యు.వి. సుబ్బారావు ఎంఈఓలకు సూచించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కృష్ణవేణి ఐటీఐ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన సహిత విద్యపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
News December 12, 2025
తాగునీరు, పారిశుద్ధ్య పనులను సజావుగా చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి, ఎక్కడా కూడా వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు చేపట్టాలని, మంజూరైన వివిధ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా తాగునీరు పారిశుద్ధ్య కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.