News April 12, 2025
కృష్ణా: నేడు ఫలితాల కోసం ఎదురుచూపులు..!

కృష్ణా జిల్లాలో 45,456 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 24,571 మంది ఫస్టియర్, 20,885 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఫలితాల విషయంలో ఎవరూ ఒత్తిడికి గురి కావొద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News September 15, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ
☞ కృష్ణా జిల్లా కొత్త ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణాలో13 మంది ఎంపీడీవోలకి పదోన్నతి
☞ కృష్ణాలో ఇంటి స్థలాల కోసం 19,382 దరఖాస్తులు
☞ వాట్సాప్‌లో కనకదుర్గమ్మ అర్జిత సేవ టికెట్లు
☞ కురుమద్దాలి ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం.. నలుగురికి గాయాలు
News September 15, 2025
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గీతాంజలి శర్మను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆమె పనితీరు ప్రశంసలు పొందింది. ఇకపై ఫైబర్ నెట్ విస్తరణలో కీలక పాత్ర పోషించనున్నారు. కొత్త జాయింట్ కలెక్టర్‌పై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
News September 15, 2025
కృష్ణా: ఈ నెల 16 పాఠశాల ఫెన్సింగ్ జట్ల ఎంపిక

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న పటమట ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, 17 బాల, బాలికల ఫెన్సింగ్ జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.