News June 30, 2024

కృష్ణా: నేడు రాష్ట్ర చెస్ జట్టు ఎంపిక పోటీలు

image

విజయవాడలోని స్ప్రింగ్ బోర్డు ప్లే స్కూల్‌లో రేపు ఆదివారం రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ జట్టు ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు టోర్నీ డైరెక్టర్ తాళ్ల నరేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర చెస్ సంఘ అనుమతితో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. టోర్నీలో తొలి 10 స్థానాల్లో నిలిచిన వారిని, అండర్- 7, 9, 11, 13, 15 కేటగిరీల్లో తొలి స్థానం పొందిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు.

Similar News

News November 14, 2025

అప్పుడు జోగి రవాణా అయితే ఇప్పుడు ఎవరి రవాణా.?

image

పెడన నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన బుసక రవాణా నేటికీ కొనసాగుతూనే ఉంది. కూటమి నాయకుల ఆరోపణల ప్రకారం, వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన బుసక రవాణా మొత్తం అప్పటి మంత్రి జోగి రమేశ్ కనుసన్నల్లో జరిగిందని ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతిస్పందించిన వైసీపీ నాయకులు, బుసక రవాణా నేటికి కూడా అలాగే కొనసాగుతుంది. అప్పుగు జోగి కారణం అయితే, నేడు జరుగుతున్న రవాణాకు బాధ్యత ఎవరిది.? అని ప్రశ్నిస్తున్నారు.

News November 14, 2025

స్వచ్ఛ ఆంధ్రలో ప్రతి అధికారి పాల్గొనాలి: కలెక్టర్

image

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం నాడు నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ, భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు.

News November 13, 2025

కృష్ణా: హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు

image

హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కృష్ణా జిల్లా సెషన్స్ జడ్జి గోపి సంచలన తీర్పు ఇచ్చారు. బందరు (M) బుద్దాలపాలెంకు చెందిన కాగిత రామ్మోహనరావు 2013 ఫిబ్రవరి 28న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న శొంఠి పైడేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా స్వామికృష్ణ, కాగిత సోమయ్య, శొంఠి వీర వెంకటేశ్వరరావు, శొంఠి వీరాంజనేయులు, శొంఠి ముసలయ్యకు జీవిత ఖైదు విధించారు.