News December 31, 2024

కృష్ణా: న్యూఇయర్ వేడుకలకు సర్వం సిద్ధం 

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలో న్యూఇయర్ వేడుకలకు యువత సిద్ధమైంది. గతంతో పోలిస్తే ఈ వేడుకల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. 10ఏళ్ల కిందట వరకు గ్రీటింగ్ కార్డ్స్ పంచుకుంటూ శుభాకంక్షలు తెలిపేవారు. హైటెక్ యుగంలో వాట్సాప్ ద్వారా విషెస్ తెలుపుకుంటున్నారు. రంగురంగుల లైట్లతో నగరం, పల్లెలు మెరిసిపోతుండగా ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలుకళకళలాడుతున్నాయి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News February 26, 2026

అక్షర ఆంధ్ర లక్ష్యంగా ‘ఉల్లాస్-02’ అమలుకు కలెక్టర్ ఆదేశం

image

విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధనకు కేంద్రం తెచ్చిన ‘ఉల్లాస్-02: అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

News February 25, 2026

వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

image

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ డీకే బాలాజీ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు (GST) సజావుగా, వంద శాతం వసూలయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.