News December 31, 2024

కృష్ణా: న్యూఇయర్ వేడుకలకు సర్వం సిద్ధం 

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలో న్యూఇయర్ వేడుకలకు యువత సిద్ధమైంది. గతంతో పోలిస్తే ఈ వేడుకల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. 10ఏళ్ల కిందట వరకు గ్రీటింగ్ కార్డ్స్ పంచుకుంటూ శుభాకంక్షలు తెలిపేవారు. హైటెక్ యుగంలో వాట్సాప్ ద్వారా విషెస్ తెలుపుకుంటున్నారు. రంగురంగుల లైట్లతో నగరం, పల్లెలు మెరిసిపోతుండగా ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలుకళకళలాడుతున్నాయి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News January 19, 2025

జగ్గయ్యపేట: తల్లితో సహజీనం చేస్తున్న వ్యక్తిని చంపాడు

image

ఈనెల 16న జగ్గయ్యపేటకు చెందిన ఎర్రంశెట్టి ఆంజనేయులు హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు. బెల్లంకొండ నరేశ్ అనే వ్యక్తి హత్య చేసినట్లు నిర్ధారించారు. నరేశ్ తల్లి ఆంజనేయులుతో సహజీవనం చేస్తున్నందున తట్టుకోలేని నరేశ్ హత్యచేశాడు. హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

News January 19, 2025

కృష్ణా: ఈ నెల 27తో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువు

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో BA.LLB కోర్సులు(2024- 25 అకడమిక్ ఇయర్) చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(Y19 నుండి Y23 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను ఫిబ్రవరి 10 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 27లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News January 19, 2025

విజయవాడ మీదుగా భువనేశ్వర్‌కు స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఈ నెల 19న విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ)- భువనేశ్వర్‌(BBSR)కు నం.08550 స్పెషల్ రైలు నడుపుతున్నట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఆదివారం చర్లపల్లిలో ఉదయం 9 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:55కు విజయవాడ, సోమవారం ఉదయం 2:15 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ రైలు విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్‌తో పాటు పలు స్టేషన్లలో ఆగుతుందన్నారు.