News July 19, 2024
కృష్ణా: పర్యవేక్షక కమిటీల్లో సభ్యుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

SC, ST అత్యాచార నిరోధక చట్ట అమలుపై జిల్లా నిఘా, పర్యవేక్షక కమిటీలో నాన్ అఫిషియల్ సభ్యులను నియమించేందుకు అధికారులు అర్హులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షాహిద్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Similar News
News October 19, 2025
మచిలీపట్నంలో నేటి నాన్ వెజ్ ధరలు ఇవే.!

మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడాలు కనిపించాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ. 200, స్కిన్లెస్ రూ. 220కి అమ్ముతున్నారు. గ్రామాల్లో స్కిన్ చికెన్ కేజీ రూ. 220, స్కిన్లెస్ రూ. 240కి విక్రయిస్తున్నారు. మటన్ ధర మాత్రం పట్టణంలో కిలో రూ. 1000గా ఉంటే, గ్రామాల్లో రూ. 800కి విక్రయాలు జరుగుతున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News October 18, 2025
కృష్ణా జిల్లాలో వర్షం.. దీపావళి వ్యాపారులకు ఆటంకం

దీపావళి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టపాసులు, గుండు సామాగ్రి దుకాణాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షం వ్యాపారులకు ఆటంకంగా మారింది. పండుగ సీజన్లో అధిక ఆదాయం ఆశించిన వ్యాపారులకు ఒకవైపు వర్షం, మరోవైపు అధికారుల అనుమతులు, భద్రతా నిబంధనల పరిమితులు కూడా పెద్ద సవాలుగా మారాయి.
News October 18, 2025
కృష్ణా: విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి నేడే

తెలుగు సాహిత్యాన్ని ప్రపంచస్థాయికి చేర్చిన కవి సామ్రాట్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి నేడు. 1895 సెప్టెంబర్ 10న ఉమ్మడి కృష్ణా (D) నందమూరులో జన్మించిన విశ్వనాథ తన అద్భుతమైన రచనలతో తెలుగు సాహిత్యంలో అజరామరుడయ్యారు. 1976 అక్టోబర్ 18న ఆయన తుదిశ్వాస విడిచినా, ఆయన సృష్టించిన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’, ‘వేయిపడగలు’ వంటి సాహిత్య సృష్టులు తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.