News December 18, 2024

కృష్ణా: పలు రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు

image

గుంతకల్లు డివిజన్‌లో ట్రాక్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే పూరి(PURI)- యశ్వంత్‌పూర్(YPR) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.22883 PURI- YPR రైలు ఈ నెల 20న, నం.22884 YPR- PURI రైలు ఈ నెల 21న నంద్యాల- డోన్ మీదుగా కాక నంద్యాల- ఎర్రగుంట్ల- గుత్తి మీదుగా అనంతపూర్ వెళుతుందన్నారు. ఈ తేదీల్లో పై 2 రైళ్లు డోన్‌లో ఆగవని మంగళవారం తెలిపారు.

Similar News

News February 26, 2026

అక్షర ఆంధ్ర లక్ష్యంగా ‘ఉల్లాస్-02’ అమలుకు కలెక్టర్ ఆదేశం

image

విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధనకు కేంద్రం తెచ్చిన ‘ఉల్లాస్-02: అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

News February 25, 2026

వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

image

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ డీకే బాలాజీ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు (GST) సజావుగా, వంద శాతం వసూలయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.