News November 30, 2024
కృష్ణా: పలు రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు

గుంతకల్ డివిజన్‌లో భద్రతా పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే పూరి(PURI)- యశ్వంత్‌పూర్(YPR) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.22883 PURI- YPR రైలు డిసెంబర్ 6న, నం.22884 YPR-PURI రైలు డిసెంబర్ 7న నంద్యాల-డోన్ మీదుగా కాక నంద్యాల-ఎర్రగుంట్ల మీదుగా అనంతపూర్ వెళుతుందన్నారు. ఈ తేదీల్లో పై 2రైళ్లు డోన్‌లో ఆగవని తెలిపారు.
Similar News
News January 14, 2026
కృష్ణా: కోడి పందేల ముసుగులో భారీగా గ్యాంబ్లింగ్!

జిల్లా వ్యాప్తంగా కోడి పందేల ముసుగులో భారీగా గ్యాంబ్లింగ్ కొనసాగుతోంది. గుడివాడ, కేసరపల్లి, ఈడుపుగల్లులో కోడి పందేల బరుల పక్కనే గ్యాంబ్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, నిర్వాహకులు సందడి చేస్తున్నారు. కాయ్ రాజా కాయ్, నంబర్ గేమ్, గుండాట, మూడు ముక్కలాట వంటి ఆటలతో పందెం బాబులను ఆకర్షిస్తున్నారు. సరదాగా పందేలు చూడటానికి వచ్చిన వారు గ్యాంబ్లింగ్‌లోకి లాగబడి జేబులు ఖాళీ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
News January 12, 2026
సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్‌లను గుర్తించండి: కలెక్టర్

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు సెమీ మెకనైజ్డ్ కొత్త ఇసుక రీచ్‌లను గుర్తించాలన్నారు.
News January 12, 2026
కృష్ణా జిల్లాలో మరో ఇసుక రీచ్‌కు సన్నాహాలు..!

కృష్ణా జిల్లాలో మరో ఇసుక రీచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 4 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. నార్త్ వల్లూరు, రొయ్యూరు, చోడవరం, పడమటలంకలో ఉన్న ఇసుక రీచ్‌లలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఘంటసాల మండలం పాపవినాశనంలో మరో రీచ్‌ను ఏర్పాటుకు కలెక్టర్ చర్యలు చేపట్టారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


