News August 3, 2024

కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 6,034 క్యూసెక్కులు విడుదల

image

కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శుక్రవారం 6,034 క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 260, బ్యాంక్ కెనాల్ కు 1539, తూర్పు కెనాల్ కు 606, పశ్చిమ కెనాల్‌కు 189, నిజాంపట్నం కాలువకు 410, కొమ్మమూరు కాలువకు 2680 క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు .

Similar News

News September 15, 2025

సమయపాలన, క్రమశిక్షణ పాటించాలి: ఎస్పీ వకుల్

image

పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రోల్ కాల్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి పోలీస్ సిబ్బంది చక్కని యూనిఫామ్ ధరించి, సమయపాలన పాటించాలని, ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ సూచించారు.

News September 15, 2025

పులిపాటి వెంకటేశ్వర్లు మన తెనాలి వారే

image

తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు పులిపాటి వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా తెనాలిలో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచుకున్న పులిపాటి తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. నాటకాలలో అర్జునుడు, నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి, తదితర పాత్రలను పోషించడమే కాక,1932లో సినిమా రంగంలో ప్రవేశించి చింతామణి, హరిశ్చంద్ర తదితర 12 సినిమాల్లో నటించారు.

News September 15, 2025

తొలి తెలుగు కథానాయకుడు, తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన నటుడు

image

తెలుగు సినిమా కథానాయకుడు, సుప్రసిద్ధ రంగస్థల నటుడు వల్లూరి వెంకట సుబ్బారావు గుంటూరు జిల్లా మునిపల్లె గ్రామంలో జన్మించడం వలన మునిపల్లె సుబ్బయ్య గుర్తింపు పొందారు. ఈయన వెంకటగిరి రాజా వారిచే “నటశేఖర” బిరుదు పొందారు. సెప్టెంబర్ 15 1931లో తొలి టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద”లో హిరణ్యకశపునిగా నటించి చరిత్ర సృష్టించారు. ఈయన తొలి తెలుగు కథానాయకుడే కాక, తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసి చరిత్రలో నిలిచిపోయారు.