News July 18, 2024

కృష్ణా: ‘పామాయిల్ సాగుతో దీర్ఘకాలిక అధిక ఆదాయం’

image

పామాయిల్ సాగుతో దీర్ఘకాలం అధిక ఆదాయం పొందవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన జిల్లాలో ఉన్న పతాంజలి, వాహ్యన్ కాఫీ, 3ఎఫ్ పామాయిల్ కంపెనీ ప్రతినిధులు, ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పామాయిల్ సాగు విధానం, బిందు సేద్యం, సాగుకు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ రాయితీలు, రైతుల నుంచి కంపెనీలు పంట సేకరించే విధానంపై ఆయన చర్చించారు. 

Similar News

News December 11, 2024

17న విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

image

ఈ నెల 17న విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నట్లు సీఎస్ నీరభ్‌కుమార్ తెలిపారు. మంగ‌ళ‌వారం రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతార‌న్నారు. ఈనెల 17న ఉదయం 11.20 గంటలకు విజయవాడకు చేరుకొని అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో మంగ‌ళ‌గిరి వెళ్త‌ర‌ని చెప్పారు. మధ్యాహ్నం 12.05 గంటలకు స్నాతకోత్సవంలో పాల్గొననున్నట్లు తెలిపారు.

News December 10, 2024

13న స్వర్ణాంధ్ర @ 2047కి శ్రీకారం: కలెక్టర్

image

విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడిచే స్వర్ణాంధ్ర @ 2047కి శ్రీకారం చుట్టడం జరుగుతుందని కలెక్టర్‌ డా.జి.లక్ష్మిశా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభకు సుమారు 25వేల మంది ప్రజలు హాజరు కానున్నారని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు.

News December 10, 2024

గుడివాడ: కళాశాలకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలిక

image

గుడివాడ కేటీఆర్ మహిళా కళాశాల వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్మెన్‌గా ఉన్న దుర్గారావు కుమార్తె ప్రియాంక అదృశ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. పాలిటెక్నిక్ ఫస్టియర్ చదువుతున్న యువతి, శనివారం కాలేజీకి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వివాహితుడు రాహుల్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ పై టూ టౌన్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిపారు.