News December 22, 2024
కృష్ణా: పీజీ డిప్లొమా పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కాలేజీల్లో యోగాలో పీజీ డిప్లొమా కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ పరీక్షలు జనవరి 21 నుంచి నిర్వహించనున్నట్లు ANU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు 2025 జనవరి 21లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు ANU వెబ్సైట్ చూడాలంది.
Similar News
News October 13, 2025
ఇందిరాగాంధీ స్టేడియంలో కబడ్డీ, వాలీబాల్ జట్ల ఎంపిక

కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-19 కబడ్డీ, వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.
News October 13, 2025
మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్కు 32 అర్జీలు

కృష్ణాజిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి 32 అర్జీలు అందాయి. అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు వివరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన తప్పక పరిష్కార చర్యలు చేపడతామని అర్జీదారులకు తెలియజేశారు. చట్ట పరిధిలో పరిష్కార చర్యలు ఉంటాయన్నారు.
News October 13, 2025
MTM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

కలెక్టర్ డీ.కే. బాలాజీ నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక-మీకోసం” కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, డీఆర్ఓ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. ప్రజల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.