News December 11, 2024
కృష్ణా: పీజీ పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో సైన్స్, ఆర్ట్స్ గ్రూపులలో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి 2025 జనవరి 10 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని కోరింది.
Similar News
News October 22, 2025
రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – కలెక్టర్

జిల్లాలో నెలకొన్న పలు రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో అర్హత గల లబ్ధిదారులను గుర్తించాలన్నారు.
News October 22, 2025
MTM : ప్రారంభమైన కార్తీక మాసం.. సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు

కార్తీక మాసం సందర్భంగా సముద్ర పుణ్య స్నానాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక మాసం నెల రోజులపాటు సముద్రంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్షలాది మంది సముద్ర స్నానాలు ఆచరిస్తారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంకు సమీపంలో ఉన్న మంగినపూడి బీచ్ నెల రోజుల పాటు భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు బీచ్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
News October 22, 2025
కృష్ణా: జగన్ను కలిసిన వైసీపీ నేతలు

తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, రూహుల్లా, అరుణ్ కుమార్ తదితరులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డితో సమగ్రంగా చర్చించారు.