News August 3, 2024
కృష్ణా: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో ఏప్రిల్-2024లో జరిగిన M.Sc. నానో టెక్నాలజీ 2, 3, 5వ సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని ANU వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/examcell/results చూడాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News November 17, 2025
కృష్ణా: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. జిల్లాలో వరి కోతలను రైతులు ముమ్మరం చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న కొంత మంది వరి కోత మిషన్ల ధరలను విపరీతంగా పెంచేశారు. గంటకు రూ.3 వేలుకు గాను రూ. 4వేలు వరకు డిమాండ్ చేస్తుండటం రైతులకు భారంగా మారింది.

కృష్ణా: ఖరీఫ్ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.