News November 25, 2024
కృష్ణా: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన ఎంఎస్సీ- బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఆక్వా కల్చర్, ఫుడ్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవచ్చు.
Similar News
News October 27, 2025
కృష్ణా: తుఫాన్ భయం.. పంట రక్షణలో రైతులు నిమగ్నం

తుఫాన్ ప్రభావం కొనసాగుతుండడంతో ముందుగానే చేతికి వచ్చిన పంటను భద్రపరచుకునే పనుల్లో రైతులు జిల్లా వ్యాప్తంగా నిమగ్నమయ్యారు. వర్షం ఎప్పుడు మొదలవుతుందో అన్న ఆందోళనతో పంటను ఎండబెట్టి రాశులుగా చేసి భద్రపరుచుకుంటున్నారు. తుఫాన్ కారణంగా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం రాశులుగా వేసి తడవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
News October 27, 2025
దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయండి: కలెక్టర్

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న దృష్ట్యా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.
News October 26, 2025
కృష్ణా: తుఫాన్ ప్రభావంపై డీపీఓ హెచ్చరిక

తుఫాన్ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీఓ) జె.అరుణ సూచించారు. మట్టి మిద్దెలు, కల్వర్టులు, పూరి గుడిసెలు, రోడ్డు పక్కన గుడారాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఓలు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.


