News August 3, 2024

కృష్ణా: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో ఏప్రిల్-2024లో జరిగిన M.Sc. నానో టెక్నాలజీ 2, 3, 5వ సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని ANU వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/examcell/results చూడాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

Similar News

News September 18, 2024

కృష్ణా: ఇసుక బుకింగ్‌పై సిబ్బందికి శిక్షణ

image

ఇసుక Online బుకింగ్ విధానంపై గ్రామ / వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ విధానం అమలు చేయనున్నదని, ఇందుకు సంబంధించి పోర్టల్‌ను రేపు ప్రారంభిస్తారన్నారు.

News September 18, 2024

విజయవాడ: మంత్రి నిమ్మలను కలిసిన పలువురు నేతలు

image

విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడును మాజీ ఎంపీ, లైలా గ్రూప్ ఛైర్మన్, గోకరాజు గంగరాజు, ఎస్ఎల్‌వీ గ్రూప్ ఛైర్మన్ శ్రీనివాసరాజు, తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడును వారు సత్కరించారు. అనంతరం బుడ‌మేరు వ‌ర‌ద కార‌ణంగా కేస‌ర‌ప‌ల్లిలో ముంపుకు గురైన ఎస్ఎల్‌వీ లైలా గ్రీస్ మెడోస్ కాలనీవాసులకు భ‌విష్య‌త్తులో త‌మ నివాసాల‌వైపు వ‌ర‌ద నీరు రాకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు కోరారు.

News September 18, 2024

భవానీపురంలో నేడు పవర్ కట్

image

భవానీపురం సబ్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విజయవాడ టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బీ.వీ సుధాకర్ తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు టీచర్స్ కాలనీ, అప్నా బజార్ రోడ్డు, ఇందిరా ప్రియదర్శినీ కాలనీ, దర్గాప్లాట్లు, హెచ్బీ కాలనీలోని 450 ఎస్ఎఫ్ఎ బ్లాక్ వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.