News July 14, 2024

కృష్ణా: పోలవరం ఎడమ కాల్వపై మంత్రి నిమ్మల సమీక్ష

image

పోలవరం ఎడమ కాల్వ స్థితిగతులపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. అమరావతి సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ సమీక్ష జరిపారు. ఎడమ కాల్వ ప్రస్తుత స్థితిగతులు, ఉమ్మడి కృష్ణా తదితర ప్రాంతాలకు నీటి సరఫరా తదితర అంశాలపై నిమ్మల అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.

Similar News

News October 16, 2024

కృష్ణా: ఇసుక తవ్వకాలకు మరికొన్ని రోజులు ఆగాల్సిందే

image

హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జూన్ 1-అక్టోబర్ 15 మధ్య ఇసుక తవ్వకాల్ని ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో నేటి నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంది. ఎగువ నుంచి కృష్ణా, గోదావరి నదులలో వరద తగ్గగానే దాదాపు 60 ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని సమాచారం.

News October 16, 2024

కృష్ణా: ఫార్మసీ విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీ.ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్(Y17 నుంచి Y22 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.

News October 16, 2024

కృష్ణా: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా ట్వీట్ చేసింది. సముద్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వాయుగుండం రేపు తెల్లవారు జామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.