News February 23, 2025
కృష్ణా: పోలవరం లాకుల వద్ద ఇద్దరు గల్లంతు

కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పోలవరం లాకులు కొమ్మూరు వద్ద నీటిలో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరవల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నాగూర్ బాషా (16), షేక్ షరీఫ్ (16) తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 20, 2025
కృష్ణా జిల్లాలో ఇద్దరు ఇన్విజిలేటర్లు సస్పెండ్

పదో తరగతి పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తాడిగడప ఎంపీపీ ఎస్ మెయిన్ పాఠశాల ఇన్విజిలేటర్‌ను డీఈవో రామారావు సస్పెండ్ చేశారు. గైర్హాజరైన విద్యార్థి స్థానంలో మరొకరు పరీక్ష రాయడాన్ని గమనించకుండా బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో ఈ చర్య తీసుకున్నారు. కంకిపాడులో ప్రశ్నపత్రం మార్పిడి ఘటనలో మరో ఇన్విజిలేటర్‌ను కూడా సస్పెండ్ చేశారు.
News March 19, 2025
కృష్ణా: 10వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతం

10వ తరగతి పరీక్షల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 21,504 మంది విద్యార్థులకు గాను 21,026 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరు శాతం 97.78% నమోదైంది. 33 పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ అధికారులు తనిఖీ చేయగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని డీఈఓ రామారావు తెలిపారు.
News March 19, 2025
బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధమవ్వండి: కలెక్టర్

మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. త్వరలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్‌పై బుధవారం తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గతంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో చర్చించి త్వరలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ తేదీలను ప్రకటిస్తామన్నారు.