News March 17, 2025

కృష్ణా: ప్రజా సమస్యలు పరిష్కరించండి- ఎస్పీ 

image

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్ గంగాధర రావు పాల్గొని 44 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.

Similar News

News March 18, 2025

రేపు కృష్ణా జిల్లాకు రానున్న మంత్రి నారా లోకేశ్

image

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆగిపోయిన అశోక్ లేలాండ్ ప్లాంట్‌కు కొత్త జీవం పోసేందుకు మంత్రి నారా లోకేశ్ బుధవారం జిల్లాకు రానున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పలువురు అధికారులుు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా నిరీక్షణలో ఉన్న స్థానికులకు ఇది వరంలాంటిదన్నారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో మల్లవల్లి పారిశ్రామిక హబ్‌గా ముందడుగు వేయనున్నట్లు తెలిపారు.

News March 18, 2025

కృష్ణా జిల్లాలో పేర్ల మార్పు రాజకీయం

image

కృష్ణా జిల్లాలో పేరు మార్పుల రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో NTR యూనివర్సిటీని YSR యూనివర్సిటీగా మార్చగా, కూటమి ప్రభుత్వం తిరిగి NTR పేరునే పెట్టింది. ఇప్పుడు YSR తాడిగడపను తాడిగడపగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా NTR స్వగ్రామమైన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉండగా దీనికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

News March 18, 2025

తోట్లవల్లూరు: కోడి పందేల శిబిరంపై పోలీసుల దాడులు 

image

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు, దేవరపల్లిలోని కోడి పందేల శిబిరంపై తోట్లవల్లూరు పోలీసుల సోమవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 21 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.9 వేల నగదు, 3 కోడి పుంజులు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పమిడి ముక్కల సర్కిల్ పరిధిలో జూద క్రీడల్లో పాల్గొన్నా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చిట్టిబాబు హెచ్చరించారు.

error: Content is protected !!