News May 20, 2024
కృష్ణా: ‘ప్రతి 15 రోజులకు శాఖల వారీ సమీక్షలు’
జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలయ్యే కార్యక్రమాలను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో సమీక్షించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా రైతులకు గతంలో మాదిరిగా అవసరమైన ఎరువులు విత్తనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 13, 2024
కృష్ణా: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
కృష్ణా జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 పరీక్షలపై పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు మచిలీపట్నం, విజయవాడలో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి.
News December 13, 2024
కోర్టులో పేర్నినాని సతీమణి బెయిల్ పిటిషన్
సివిల్ సప్లయ్ గోదాంలో బియ్యం అవకతవకలపై పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైన సంగతి విదితమే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టుని ఆశ్రయించారు. కాగా తప్పు చేస్తే ఎంతటి వారినైనా కర్మ వదిలి పెట్టదని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాసులు విమర్శించారు. పెదపట్నంలో కబ్జా చేసిన 100ఎకరాల మడ అడవుల విషయంలో కూడా పేర్ని నాని శిక్షార్హుడే అన్నారు. అయితే పేర్ని కుటుంబం అజ్ఙాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.
News December 13, 2024
కృష్ణా: వాయిదా పడ్డ డిగ్రీ పరీక్షలు.. రివైజ్డ్ టైం టేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో డిసెంబర్ 2024లో జరగాల్సిన డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షలు వాయిదా పడినట్లు యూనివర్శిటీ యాజమాన్యం గురువారం తెలిపింది. ఈ పరీక్షలను 2025 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 14 మధ్య నిర్ణీత తేదీలలో నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. రివైజ్డ్ టైం టేబుల్‌కు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని యూనివర్శిటీ తాజాగా ఒక ప్రకటనలో సూచించింది.