News June 30, 2024
కృష్ణా: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా అగర్తల (AGTL), సికింద్రాబాద్(SC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07029 AGTL- SC ట్రైన్ను జూలై 5 నుంచి అక్టోబర్ 4 వరకు, నెం. 07030 SC- AGTL ట్రైన్ను జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి.
Similar News
News December 10, 2025
గన్నవరం: ఇసుక కుప్ప కాదండి.. రంగు మారిన ధాన్యం..!

పై ఫోటోలో మీకు కనిపిస్తున్నది ఇసుక కుప్ప అనుకుంటున్నారు కదూ. కానే కాదు.. అది రంగు మారిన ధాన్యం రాశి. గత మొంథా తుఫాను వరదలో నానిన వరి చేను నూర్చారు. గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఇలా రంగు మారిన ధాన్యం రాశులు చూడొచ్చు. రైతులు 75 కిలోల బస్తా రూ.1300 చొప్పున వ్యాపారికి బుధవారం విక్రయించారు. ఈ విధంగా బస్తాకు వెయ్యి రూపాయలు చొప్పున రైతులకు నష్టాలు మిగిల్చింది తుఫాను.
News December 10, 2025
రహదారుల అభివృద్ధికి రూ.87.25 కోట్లు: ఎంపీ బాలశౌరి

కృష్ణా జిల్లా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 87.25 కోట్ల ఎస్ఏఎస్సీఐ (SASCI) నిధులు మంజూరు చేసినందుకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ఫేజ్-1 కింద రూ. 2,123 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ జీ.ఓ విడుదల చేసిందని ఎంపీ వివరించారు.
News December 9, 2025
కృష్ణా: డీఈఓ బదిలీ.. నూతన డీఈఓగా సుబ్బారావు

కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు బదిలీ అయ్యీరు. పల్నాడు జిల్లాకు రామారావును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో యూవీ సుబ్బారావును నియమించారు. సుబ్బారావు ఎన్టీఆర్ జిల్లా డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన మచిలీపట్నం డీవైఈఓగా విధులు నిర్వర్తించారు. సౌమ్యుడుగా, వివాదరహితునిగా సుబ్బారావు పేరు తెచ్చుకున్నారు.


